Bala Krishna | NBK111 గ్లింప్స్‌లో ఓజీ, సలార్ ఛాయలు?.. బాలయ్య కొత్త అవతార్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Bala Krishna | నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NBK111 నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా, అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Bala Krishna | నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NBK111 నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా, అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ ఇప్పటివరకు కనిపించని స్టైలిష్ లుక్‌లో దర్శనమివ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గ్లింప్స్ ప్రారంభంలోనే 1993 ముంబై నేపథ్యంలో కథ సాగబోతున్నట్లు సూచించే విజువల్స్‌ను చూపించారు. నగరంలోని వీధులు, అండర్‌వరల్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించే షాట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ విజువల్స్ చూసిన కొందరు నెటిజన్లు వెంటనే వాటిని OG సినిమాతో పోల్చడం మొదలుపెట్టారు.
ముంబై నేపథ్యంలో తెరకెక్కుతున్న OG చిత్రంలో కనిపించిన కొన్ని ఫ్రేమ్స్, కలర్ టోన్లు, కెమెరా యాంగిల్స్‌కు NBK111 గ్లింప్స్‌లోని కొన్ని సన్నివేశాలు దగ్గరగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వర్షంలో బాలకృష్ణ నడుస్తూ వచ్చే సన్నివేశాలు, కాళ్లను మాత్రమే ఫోకస్ చేస్తూ చూపించిన షాట్స్, చేతిలో ఆయుధంతో కనిపించే ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో ఉన్న స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ వైబ్‌ను NBK111 గ్లింప్స్ గుర్తు చేస్తోందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బైక్‌పై బాలకృష్ణ ఎంట్రీ ఇస్తూ గన్ పట్టుకుని కనిపించే షాట్ సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమైంది.
అయితే మరోవైపు బాలయ్య అభిమానులు మాత్రం ఈ పోలికలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. గోపీచంద్ మలినేని తనదైన మాస్ టేకింగ్‌తో బాలకృష్ణను కొత్త కోణంలో చూపిస్తున్నాడని, గ్లింప్స్‌లో కనిపించినవి కేవలం యాక్షన్ జానర్‌కు సంబంధించిన సాధారణ అంశాలేనని చెబుతున్నారు. గ్లింప్స్ చివర్లో బాలకృష్ణ భారీ ప్రొక్లైన్ యంత్రంపై నిలబడి కనిపించే విజువల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్ చూసిన కొందరు ప్రేక్షకులు సలార్ ఇంటర్వెల్ బ్లాక్‌ను గుర్తు చేసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎలివేషన్, డార్క్ టోన్ విజువల్స్, పవర్ఫుల్ ప్రెజెంటేషన్ కారణంగా ఆ సన్నివేశం సలార్ తరహా ఫీలింగ్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే కావడంతో పూర్తి కథ లేదా పాత్ర స్వరూపం గురించి ఇప్పుడే నిర్ణయానికి రావడం కష్టమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు NBK111 గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే కొందరు నెటిజన్లు థమన్ అందించిన బీజీఎం స్టైల్ కూడా OG ప్రమోషనల్ కంటెంట్‌ను గుర్తు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు థమన్ అభిమానులు మాత్రం ఇది అతని ప్రత్యేకమైన మాస్ స్టైల్ అని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

