Bala Krishna | ‘NBK111’ రిలీజ్ డేట్ ఫిక్స్? ..ప్రభాస్ ‘ఫౌజీ’తో క్లాష్ తప్పించుకునే ప్లాన్‌లో బాలయ్య టీమ్!
Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111 పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111 పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా బాలయ్య స్టైలిష్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త స్టైలిష్ అవతారంలో గోపీచంద్ మలినేని చూపించబోతున్నారని గ్లింప్స్ ద్వారానే స్పష్టమైంది. పవర్ఫుల్ యాక్షన్‌తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘NBK111’ విడుదల తేదీ గురించిన చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ తొలి వారంలోనే విడుదల చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించడంతో మేకర్స్ తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ప్రభాస్ సినిమాతో పోటీ పడకుండా, క్రిస్మస్ హాలిడే సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేస్తే కలెక్షన్లకు మరింత అనుకూలంగా ఉంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు, అనంతరం న్యూ ఇయర్ హాలిడేస్ కలిసి రావడం వల్ల సినిమాకు లాంగ్ రన్ దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాలకృష్ణ మరోసారి తన మాస్ పవర్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే డిసెంబర్ 25 విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిలీజ్ డేట్ ఖరారైతే, ఈ క్రిస్మస్ సీజన్లో బాలయ్య అభిమానులకు మరో భారీ సినీ పండుగ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

