Harshaali Malhotra | టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ.. ‘అఖండ 2’లో ‘భజరంగీ భాయిజాన్’ నటి
Akhanda 2 | సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' సినిమాలో మున్నీ పాత్రలో నటించి ప్రశంసలు పొందిన హర్షాలీ మల్హోత్రా బంపరాఫర్ కొట్టేసింది.
Akhanda 2 | సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ సినిమాలో మున్నీగా తన నటనతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్‌ను దక్కించుకుంది! నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంలో ఈ యువ నటి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో హర్షాలీ ‘జనని’ అనే పాత్రలో నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెడుతుండటం విశేషం.
‘భజరంగీ భాయిజాన్’ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న హర్షాలీ, ఇప్పుడు బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాతో తిరిగి రావటం, అది కూడా తెలుగులో డెబ్యూ చేయటం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ‘అఖండ 2’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది, బాలకృష్ణతో ఆమె సీన్స్ ఎలా పండాయో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
A smile of an angel and a heart of gold ❤️
Introducing Bajrangi Bhaijaan fame #HarshaaliMalhotra as ‘JANANI’ from #Akhanda2 ✨#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/t5M3pVh8c1— 14 Reels Plus (@14ReelsPlus) July 2, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

