Baahubali The Eternal War | మళ్లీ తెరపై బాహుబలి సంచలనం… ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’యానిమేషన్ టీజర్ అదుర్స్!
Baahubali The Eternal War | భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను ఎవరు అంత ఈజీగా మర్చిపోగలరు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన మెగా విజువల్ వండర్ రెండు భాగాలుగా విడుదలై దేశవ్యాప్తంగా అపారమైన విజయాన్ని సాధించింది.
Baahubali The Eternal War | భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను ఎవరు అంత ఈజీగా మర్చిపోగలరు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన మెగా విజువల్ వండర్ రెండు భాగాలుగా విడుదలై దేశవ్యాప్తంగా అపారమైన విజయాన్ని సాధించింది. ఇటీవల ఈ సినిమా రెండు భాగాలని ఒకే పార్ట్‌గా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఆశ్చర్యకరంగా రీ రిలీజ్లో కూడా బాహుబలి మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద కొనసాగింది.ఇదిలా ఉంటే, రాజమౌళి ముందుగానే ప్రకటించినట్టుగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యానిమేషన్ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. రీ రిలీజ్ సందర్భంగా ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా ప్రదర్శించారు. ఇప్పుడు ఆ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడంతో అభిమానుల్లో హడావుడి మొదలైంది.
టీజర్ రమ్యకృష్ణ (శివగామి) గంభీరమైన వాయిస్‌తో ప్రారంభమవుతుంది. “బాహుబలి మరణం ఒక ముగింపు కాదు… అది ఒక మహా కార్యానికి ప్రారంభం… తన గమ్యం యుద్ధం.”.. ఈ ఒక్క డైలాగ్‌తోనే కథపై ఉత్కంఠ పెరిగిపోయింది. టీజర్లో బాహుబలి మరణం తరువాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్లడం, శివలింగం ముందు నృత్యం చేయడం, ఆకాశ లోకంలో దేవతలతో యుద్ధం చేయడం వంటి అద్భుతమైన విజువల్స్ చూపించారు. బాహుబలి కోసం ఇంద్రుడు – విశాసురుడు మధ్య జరిగే భీకర పోరాటం, చివరికి విశాసురుడు ఓడిపోవడం టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ యాక్షన్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక టచ్, మైథాలజికల్ థీమ్ — ఇవన్నీ కలగలిపి ఈ సిరీస్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నట్టు కనిపిస్తోంది.
ఈ యానిమేషన్ సిరీస్‌ను ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిరీస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అద్భుతమైన విజువల్ టెక్నాలజీతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ అసలు బాహుబలి కథకు కొనసాగింపు కాకుండా, పూర్తిగా కొత్త విశ్వంలో సాగే ఆధ్యాత్మిక – ఫాంటసీ యాక్షన్ యానిమేషన్‌గా ఉండబోతోంది. టీజర్ విడుదలతోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. “యానిమేషన్ అదిరిపోయింది”, “రాజమౌళి మరో విజువల్ వండర్‌కు శ్రీకారం చుట్టాడు”, “బాహుబలి స్పిరిట్ ఇంకా బతికే ఉంది” అంటూ కామెంట్లు కురుస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

