Baahubali | ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు అంతర్జాతీయ గౌరవం.. అన్నెసీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన భారతీయ యానిమేషన్ చిత్రం
Baahubali | భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన బాహుబలి చిత్రం అనేక రికార్డులు నమోదు చేసింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత దేశీయ చిత్ర పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన కథనం, విజువల్ వైభవంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫ్రాంచైజీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Baahubali | భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన బాహుబలి చిత్రం అనేక రికార్డులు నమోదు చేసింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత దేశీయ చిత్ర పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన కథనం, విజువల్ వైభవంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫ్రాంచైజీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రభాస్ హీరోగా, దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ ఎపిక్‌కు కొనసాగింపుగా రూపొందుతున్న యానిమేషన్ చిత్రం బాహుబలి: ది ఎటర్నల్ వార్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్ ఫిల్మ్ వేడుకలలో ఒకటైన అన్నెసీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు( Annecy International Animation Film Festival కు) ఈ చిత్రం ఎంపిక కావడం విశేషం. యానిమేషన్ రంగంలో అత్యున్నత స్థాయి ప్రాజెక్టులు మాత్రమే ఈ ఫెస్టివల్‌కు ఎంపిక అవుతాయి. అలాంటి వేదికపై భారతీయ యానిమేషన్ చిత్రం నిలవడం దేశానికి గర్వకారణంగా మారింది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, చిత్రంపై అంచనాలను మరింత పెంచింది.
ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి ఉన్న భారీ క్రేజ్ కారణంగా ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌పై కూడా మంచి ఆసక్తి నెలకొంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ కలిసి ప్రపంచ స్థాయి నాణ్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్‌తో పాటు ఎస్. ఎస్. రాజమౌళి కూడా నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్నారు. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ద్వారా భారతీయ యానిమేషన్ సినిమాలు కూడా ప్రపంచస్థాయిలో పోటీ పడగలవని మరోసారి నిరూపించబడుతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే, భవిష్యత్తులో మరిన్ని భారీ యానిమేషన్ ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు ప్రధానంగా లైవ్ యాక్షన్ సినిమాలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారతీయ సినిమా, ఇప్పుడు యానిమేషన్ రంగంలో కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. బాహుబలి: ది ఎటర్నల్ వార్ ఈ దిశలో ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
We are happy to announce that the next chapter of the #Baahubali legacy, #BaahubaliTheEternalWar, has been officially selected for the Work in Progress lineup at the prestigious Annecy International Animation Film Festival 2026!
Annecy, see you soon! Jai Maahishmathi! ✊… pic.twitter.com/hcPnAw9giT
— Baahubali (@BaahubaliMovie) April 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

