Avengers Endgame | మార్వెల్ అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇప్పుడు ప్రత్యేకమైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ పేరుతో భారతీయ థియేటర్లలో మరోసారి సందడి చేయనుంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ను సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ స్పెషల్ రీ-రిలీజ్ అందుబాటులో ఉండనుంది. దీంతో భారతీయ మార్వెల్ అభిమానులు తమ అభిమాన సూపర్ హీరోలను మరోసారి భారీ తెరపై చూడబోతున్నారు.
సాధారణ థియేటర్లతో పాటు ఐమాక్స్ మరియు ప్రత్యేకమైన ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లో కూడా ఈ ప్రదర్శన ఉండనుంది. భారీ స్క్రీన్, మరింత స్పష్టమైన విజువల్స్, శక్తివంతమైన సౌండ్‌తో గతంలో కంటే మరింత గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్లో మార్వెల్ అభిమానులకు మరో పెద్ద సర్ప్రైజ్ ఉండబోతోంది. డిసెంబర్ 18, 2026న థియేటర్లలోకి రానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి సంబంధించిన ప్రత్యేకమైన స్నీక్ పీక్‌ను కూడా ‘ఎండ్‌గేమ్ – ఎంకోర్’ ప్రదర్శనలో చూపించనున్నట్లు సమాచారం. దీంతో ‘ఎండ్‌గేమ్’ను మరోసారి ఆస్వాదించడమే కాకుండా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ భవిష్యత్‌లో రాబోయే భారీ చిత్రంపై ముందస్తు గ్లింప్స్ పొందే అవకాశం అభిమానులకు లభించనుంది. ఈ అంశమే ఈ స్పెషల్ ఎంకోర్ ప్రదర్శనపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను తొలిసారి థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు మరోసారి ఆ అనుభూతిని గుర్తు చేయడమే ఈ ఎంకోర్ రిలీజ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐమాక్స్, భారీ ప్రీమియం స్క్రీన్లలో సినిమాను చూడటం ద్వారా మార్వెల్ అభిమానులు మరోసారి గ్రాండ్ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది.ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా, హాలీవుడ్లో ప్రముఖ దర్శకులైన ఆంథనీ రూసో, జో రూసో దర్శకత్వం వహించారు. భారీ తారాగణం, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగభరితమైన కథనం ఈ సినిమాను ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేక చిత్రంగా నిలిపాయి. మొత్తానికి, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ సెప్టెంబర్ 25న మరోసారి థియేటర్లలోకి రావడంతో మార్వెల్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం నెలకొననుంది. ఇక ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ స్నీక్ పీక్ ఈ స్పెషల్ ప్రదర్శనకు మరింత ఆకర్షణగా నిలవనుంది.