Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
Marvel Studios | మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday). ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17, 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.
Marvel Studios | మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday). ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17, 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకను ప్రకటించింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో, హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.), క్రిస్ ఎవాన్స్ (Chris Evans) భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ‘డాక్టర్ డూమ్’ (Doctor Doom) గా, క్రిస్ ఎవాన్స్ ‘స్టీవ్ రోజర్స్’ (Steve Rogers) పాత్రల్లో కనిపించనున్నారు.
వీడియో సందేశంలో వారు మాట్లాడుతూ.. ‘‘నమస్తే ఇండియా! దీపావళి అంటే ఒక అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం. ఈ విషయం గురించి మాకు బాగా తెలుసు. అయితే, చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి బదులుగా, ఈసారి బహుశా వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం సాగుతుందేమో! అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు. ఆంథోనీ రుస్సో (Anthony Russo), జో రుస్సో (Joe Russo) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్ (Kevin Feige), లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మిస్తున్నారు.
ఇందులో క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, టామ్ హిడిల్స్టన్, సెబాస్టియన్ స్టాన్ తదితర భారీ తారాగణం నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

