ప్రేక్షకులే ముందున్నారు!

‘మాకున్న కమర్షియల్ పరిధుల్లో ఇలాంటి బోల్డ్ కథతో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా?లేదా? అని భయపడ్డాం. మాకంటే ప్రేక్షకులు రెండు అడుగులు ముందే ఉన్నారని ఈ విజయం నిరూపించింది’ అని అన్నారు సంతోష్‌శోభన్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ‘ఏక్ మినీ కథ’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ రాపోలు దర్శకత్వం వహించారు. కావ్యథాపర్ కథానాయిక. దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించారు. ఇటీవల ఆమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కాన్సెప్ట్‌ను హీరోగా నమ్మి ఈ సినిమా చేశాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి సినిమా ఇదని ప్రశంసలు లభిస్తుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు ‘మనదేశంలో సెక్స్ ఎడ్యూకేషన్‌ను బూతుగానే చూస్తారు. ఆ ఆలోచన ధోరణి కారణంగా ఎదురయ్యే సమస్యల్ని అశ్లీలత లేకుండా ఆలోచనాత్మకంగా ఈసినిమాలో చూపించాం’ అని మేర్లపాక గాంధీ చెప్పారు. సంతోష్‌శోభన్ మాట్లాడుతూ ‘తెలుగు తెరపై ఎవరూచేయని భిన్నమైన పాత్రను పోషించే అరుదైన అవకాశం ఈ సినిమాతో నాకు దొరికింది’ అని పేర్కొన్నారు. తొలి విజయానుభూతినిఆస్వాదిస్తున్నానని కావ్యథాపర్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bold story
- ek mini katha
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

