విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఓరి దేవుడా’. మిథిలా పాల్కర్, ఆశా భట్ నాయికలుగా నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు సమర్పణలో పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం నుంచి ‘సోమవారం పాఠశాలలో.. పాత బడదురా’ అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించగా, అర్మాన్ మాలిక్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా.