Armaan Malik | రెండోసారి యూరోపియన్ మ్యూజిక్ అవార్డు అందుకున్న అర్మాన్ మాలిక్
2020లో మొదటిసారి యూరోపియన్ మ్యూజిక్ అవార్డు గెలిచిన అర్మాన్ మాలిక్
బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ప్రతిష్ఠాత్మక యూరోపియన్ మ్యూజిక్ అవార్డ్ (ఇఎంఏ) అందుకున్నాడు. అర్మాన్ ఈ అవార్డు గెలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది you (యు) అనే ఇంగ్లీష్ సింగిల్‌కు ఈ అవార్డు వరించింది. 2020లో control (కంట్రోల్) అనే పాటకు అర్మాన్ మొదటిసారి యూరోపియన్ మ్యూజిక్ అవార్డు గెలిచాడు.
‘రెండోసారి యూరోపియన్ మ్యూజిక్ అవార్డ్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యు పాట నాకు ఎంతో ప్రత్యేకం. ఆ పాటకు గానూ ప్రపంచ వేదిక మీద అవార్డు తీసుకుంటున్నందుకు పట్టలేనంత సంతోషం వేస్తోంది. నాకు ఓటు వేసి గెలిపించిన అభిమానులు, ఆత్మీయులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నాపై ఎనలేని ప్రేమ, అభిమానం చూపిస్తున్నవాళ్లకు, నా కుటుంబానికి, నా దేశానికి ఈ అవార్డు అంకితం’ అని అర్మాన్ సంతోషంతో చెప్పాడు.
అర్మాన్ మాలిక్ బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా హిట్ సాంగ్స్ పాడాడు. హిందీలో వజామ్ తుమ్ హో, బోల్ దో నా జరా, జబ్ తక్, తెలుగులో బుట్ట బొమ్మ పాటలతో పాపులర్ అయ్యాడు. అంతేకాదు బ్రిటన్ గాయకుడు ఎడ్ షీరన్తో కలిసి అర్మాన్ ‘2స్టెప్’ స్టూడియో ఆల్బమ్ కొత్త వెర్షన్ పాడనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

