Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా అర్జున్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమార్తె అంజన సర్జా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా అర్జున్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమార్తె అంజన సర్జా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు ఇసాయ్ నట్టర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుకకు అర్జున్ పెద్ద అల్లుడు ఉమాపతి రామయ్య హాజరుకాలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంజన సర్జా అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న సమయంలో ఇసాయ్ నట్టర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమకు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి బంధం తోడైంది. గతేడాది ఏప్రిల్‌లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగినట్లు సమాచారం.తాజాగా అక్టోబర్ 19న విదేశాల్లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. విదేశాల్లో పెళ్లి చేసుకున్నప్పటికీ, సంప్రదాయ హిందూ పద్ధతిలో వేడుకను నిర్వహించడం విశేషం. పెళ్లి వేడుకలో అంజన, ఇసాయ్ నట్టర్ సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. అంజన తన వివాహానికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా కూడా గతంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతి రామయ్యను ఆమె వివాహం చేసుకున్నారు. సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇప్పుడు చిన్న కుమార్తె అంజన పెళ్లి కూడా జరగడంతో అర్జున్ కుటుంబంలో వరుసగా శుభకార్యాలు చోటుచేసుకున్నాయి.అంజన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్న క్రమంలో మరో విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అర్జున్ పెద్ద అల్లుడు ఉమాపతి రామయ్య ఈ వేడుకలో కనిపించకపోవడంపై చర్చ మొదలైంది. మరదలి పెళ్లికి ఆయన ఎందుకు హాజరుకాలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఉమాపతి తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే వివాహానికి హాజరుకాలేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

