Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
Arjun | కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Arjun | కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శ్రీ ఆంజనేయం’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అర్జున్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమార్తె అంజన సర్జా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
అర్జున్ చిన్న కుమార్తె అంజన సర్జా గతంలోనే తన ప్రియుడు ఇసాయ్ నట్టర్తో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఈ నెల 19న విదేశాల్లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సుమారు 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ బంధాన్ని పెళ్లితో మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. దీంతో అర్జున్ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంజన సర్జా అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఇసాయ్ నట్టర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి కొనసాగుతున్న వీరి అనుబంధం చివరకు వివాహ బంధానికి దారితీసింది. మరోవైపు అంజన కేవలం సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘అంజన సర్జా వరల్డ్’ పేరుతో ఓ స్టార్టప్ సంస్థను స్థాపించి వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్నారు.
అర్జున్‌కు ఇద్దరు కుమార్తెలు. 1988లో నటి నివేదితను వివాహం చేసుకున్న ఆయనకు ఐశ్వర్య, అంజన సంతానం. పెద్ద కుమార్తె ఐశ్వర్య తండ్రి బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టి కథానాయికగా పలు చిత్రాల్లో నటించారు. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతి రామయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఇలా అర్జున్ ఇద్దరు కుమార్తెలు తమ జీవిత భాగస్వాములను ప్రేమించి వివాహం చేసుకోవడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం చిన్న కుమార్తె అంజన పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

