వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, శేషు మారంరెడ్డి నిర్మాత. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన వినోద్‌వర్మ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఏవో నోట్స్ రాసుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన ఆయన లుక్ ఆసక్తిగా అనిపిస్తున్నది. ‘తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి వినూత్న కథాంశమిది. భారత పురాణాలను టచ్ చేస్తూ ఫాంటసీ అంశాలతో ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణప్రసాద్, సంగీతం: అనూప్‌రూబెన్స్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, సమర్పణ: ఆర్.వీ.రెడ్డి, రచన-దర్శకత్వం: జయశంకర్.