Ari | ‘అరి’కి పదో రోజూ అద్భుతమైన రెస్పాన్స్.. థియేటర్లో మూవీ చూస్తున్నానని దర్శకుడి పోస్టు
Ari | ప్రస్తుతం ఓ సినిమా ఒక వారం ఆడితేనే గొప్ప అని చెప్పుకునేలా మారింది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్ వరకే హవాను చూపిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ ఓ వారం, రెండు వారాలు చిత్రాలు ఆడటం లేదు.
Ari | ప్రస్తుతం ఓ సినిమా ఒక వారం ఆడితేనే గొప్ప అని చెప్పుకునేలా మారింది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్ వరకే హవాను చూపిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ ఓ వారం, రెండు వారాలు చిత్రాలు ఆడటం లేదు. అలాంటిది గత వారం వచ్చిన నాలుగు చిత్రాల్లో ‘అరి’ మూవీ రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది.
ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి సూపర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మీడియా, సోషల్ మీడియాలో అరి సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మెల్లిగా ఈ మూవీ పికప్ అవుతోందని సమాచారం. అందుకే ఈ చిత్రాన్ని రెండో వారం కూడా కంటిన్యూ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి.
‘పేపర్ బాయ్’ లాంటి ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీతో మెప్పించిన జయ శంకర్.. ఇప్పుడు ‘అరి’ అని ఆకట్టుకున్నాడు. ఇంత వరకు రానటువంటి అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని మంచి సందేశాన్ని ఇస్తూ అరి చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీలోని క్లైమాక్స్, చివరి నిమిషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన అరి మూవీ ఇప్పుడు రెండో వారంలోకి అడుగు పెట్టింది. మరి ఈ వీక్‌లో అరి కొత్త చిత్రాలతో ఏ మేరకు పోటీ పడుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

