Ari Movie Success | ప్రస్తుత ఇండియన్ సినీ పరిశ్రమలో డివోషనల్ ట్రెండ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలు ఈ డివోషనల్ వైబ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆధ్యాత్మిక టచ్‌తో కూడిన స్టోరీలు ప్రేక్షకులను థియేటర్లకు లాగుతున్నాయి. అయితే ఇదే ట్రెండ్‌ను అనుసరించి దర్శకుడు జయశంకర్ (పేపర్ బాయ్ ఫేమ్) తన కొత్త చిత్రం అరిని రూపొందించాడు. అరి షడ్వర్గాలు (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం)ను కాన్సెప్ట్‌గా తీసుకుని ఇంతవరకు ఎవరూ అంచన వేయని ఆలోచనతో ఈ సినిమాను తెరకెక్కించాడు.
గత వారం రిలీజ్ అయిన ‘అరి’.. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలోని కాన్సెప్ట్, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆడియెన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాయి. శ్రీకృష్ణుడి ఎంట్రీ మరియు ఆయన ఇచ్చే సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజానికి ఆధ్యాత్మిక సందేశం అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని క్రిటిక్స్, మీడియా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ రివ్యూలు వరుస కడుతున్నాయి –మంచి మెసేజ్‌తో కూడిన డివైన్ ఎక్స్‌పీరియెన్స్, “షడ్వర్గాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు సూపర్” అంటూ కామెంట్లు వస్తున్నాయి.
ఆరు ప్రధాన పాత్రల ద్వారా అరి షడ్వర్గాలను చిత్రీకరించిన ఈ సినిమా, మానవ మనస్తత్వాన్ని ఆధ్యాత్మికంగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. చివర్లో భగవద్గీతా స్ఫూర్తితో కూడిన సన్నివేశాలు హైలైట్. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, జీవితంలో స్వాధీనత సాధించాలనే సందేశాన్ని ఇస్తుంది. క్రిటిక్స్ ప్రత్యేకంగా చివరి సన్నివేశాలను పొగడ్తలతో ముంచెత్తారు, ఇది సినిమాను మరింత ఎలివేట్ చేసింది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి వంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి ఒక్కరూ షడ్వర్గాలను రిప్రజెంట్ చేస్తూ, సినిమాకు బలం చేకూర్చారు. అనసూయ ఎమోషనల్ డెప్త్, వినోద్ వర్మ ఇంటెన్సిటీ ప్రశంసలు అందుకుంటున్నాయి. మొత్తంమ్మీద జయశంకర్.. పేపర్ బాయ్ తర్వాత ‘అరి’తో మరోసారి తన మార్క్ చూపించాడు. డివైన్ ట్రెండ్‌లో ఈ చిత్రం కూడా ఆడియెన్స్ గుండెల్లో చోటు సంపాదించింది. ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఉన్నవారు థియేటర్లో మిస్ చేయొద్దు ఇది కేవలం సినిమ కాదు, ఒక మంచి అనుభవం! బాక్సాఫీస్ వసూళ్లు కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి మరిన్ని షోలు జోడించే అవకాశం ఉంది.