Ammu Abhirami | ప్రభాస్ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్నారా..?
Ammu Abhirami | ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే అందరి చూపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యంగా పర్వం, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల మీదే ఉంది. కానీ వీటన్నిటితో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.
Ammu Abhirami | ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే అందరి చూపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యంగా పర్వం, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల మీదే ఉంది. కానీ వీటన్నిటితో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. దానికి దర్శకుడు మారుతి(Maruthi Prabhas Movie). ఇప్పటి వరకు చిన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. అది కూడా ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు మారుతి.
2024 లోనే సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు దర్శక నిర్మాతలు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అన్ని చెప్తాను అంటున్నాడు మారుతి. సస్పెన్స్ హారర్ జోనర్ లో మారుతి సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్లు మాత్రమే కాదు మరో హీరోయిన్ కూడా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు అమ్మూ అభిరామి.
తెలుగు ఇండస్ట్రీలో ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. అయితే ఈ మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించింది. తమిళంలో ఇప్పటికే అమ్ము అభిరామి కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు గానీ ప్రభాస్ సినిమాలు ఈమె నటించింది అంటే మాత్రం దెబ్బకు దశ తిరిగిపోవడం ఖాయం. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు మారుతి సినిమాకు డేట్స్ ఇస్తున్నాడు ప్రభాస్. అయితే ఇప్పటికే ప్రాజెక్ట్ కే పాటు మిగిలిన సినిమాలు కూడా చివరి దశకు రావడంతో ఇప్పటి నుంచి మారుతి సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నాడు ప్రభాస్. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే బిజినెస్ 300 కోట్ల వరకు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

