ప్రస్తుతం అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ‘రాకా’ షూట్లో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం హైదరాబాద్ కేంద్రంగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందులో విభిన్న కోణాలతో కూడిన పాత్రను బన్నీ పోషిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక పదుకోన్ కథానాయిక. మృణాల్‌ఠాకూర్, జాన్వీ కపూర్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే విడుదలైన తోడేలు చేతులతో కూడిన బన్నీ ఫస్ట్‌లుక్ ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కథతో తోడేలుకు ఉన్న సంబంధం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే.. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమాలోని అల్లు అర్జున్ పార్ట్ మొత్తం అట్లీ పూర్తి చేయనున్నారు. సన్ పిక్చర్స్ 800కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రాకా’ చిత్రం 2027 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. జనవరి నుంచి లోకేష్ కనకరాజ్ సినిమా సెట్లోకి బన్నీ ఎంట్రీ ఇస్తారని ఇన్సైడ్ టాక్.