Allu Arjun | ‘పుష్ప 2’ ఘన విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు, భారీ రెమ్యునరేషన్‌తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్న బన్నీ.. ఇప్పుడు తన సినిమాల వల్లే కాదు, తన లైఫ్‌స్టైల్ మరియు ఫ్యాషన్ ఎంపికల కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ ఫోటోలలో అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది బన్నీ చేతికి కనిపించిన ఓ ప్రీమియం లగ్జరీ వాచ్.
ఫ్యాషన్ మరియు లగ్జరీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పాటెక్ ఫిలిప్ నాటిలస్’ సిరీస్‌కు చెందిన Patek Philippe Nautilus REF: 5712/1R-001 మోడల్‌ను అల్లు అర్జున్ ధరించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ స్టార్స్ ఎంతో ఇష్టపడే ఈ వాచ్ ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. ఈ ప్రీమియం టైమ్పీస్లో 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ కేస్, ఆటోమేటిక్ మెకానిజం, మూన్ ఫేజ్ డిస్ప్లే, డేట్ ఇండికేటర్, పవర్ రిజర్వ్ ఫీచర్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. సన్‌బర్స్ట్ బ్రౌన్ డయల్, రోజ్ గోల్డ్ హ్యాండ్స్ దీనికి మరింత క్లాసిక్ లుక్‌ను తీసుకొచ్చాయి.
అయితే ఈ వాచ్ ధర ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వాచ్ అధికారిక ధర సుమారు రూ.90 లక్షల వరకు ఉండగా, దీని భారీ డిమాండ్ కారణంగా రీసేల్ మార్కెట్లో ధర ఏకంగా రూ.1.8 కోట్లకు పైగానే ఉందని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో “బన్నీ స్టైల్ అంటే రేంజ్ వేరే” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ దర్శకులతో ఆయన చేయబోయే చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, బన్నీ ప్రతి పబ్లిక్ అపియరెన్స్‌తో తన స్టైల్ స్టేట్మెంట్ను మరోసారి కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.