Allu Arjun | క్లిన్ కారా ఫోటోకు బన్నీ హార్ట్ ఎమోజీ.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun | ‘పెద్ది’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుమార్తె క్లిన్ కారా మూడో పుట్టినరోజు సందర్భంగా ఆమె ముఖాన్ని తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన క్లిన్ కారా ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చిన్నారి అందానికి, ఆమె తల్లిదండ్రుల పోలికలకు అభిమానులు ఫిదా అయ్యారు.
Allu Arjun | ‘పెద్ది’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుమార్తె క్లిన్ కారా మూడో పుట్టినరోజు సందర్భంగా ఆమె ముఖాన్ని తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన క్లిన్ కారా ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చిన్నారి అందానికి, ఆమె తల్లిదండ్రుల పోలికలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో క్లిన్ కారాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మేనకోడలు క్లిన్ కారా ఫోటోపై స్పందించడం అభిమానులను ఆకట్టుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న క్లిన్ కారా ఫోటోకు అల్లు అర్జున్ హార్ట్ ఎమోజీతో స్పందించారు. తన మేనకోడలిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఆయన చేసిన ఈ చిన్న కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ట్విస్ట్ ఉంది. అల్లు అర్జున్ స్పందించిన ఆ ఫోటో అసలు క్లిన్ కారా ఫోటో కాదని, ఓ ఫ్యాన్ అకౌంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన చిత్రమని తర్వాత తెలిసింది. నిజమైన ఫోటో అనుకుని అల్లు అర్జున్ దానికి స్పందించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అభిమానులు మాత్రం బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో నిజమా కాదా అన్నది పక్కన పెడితే, తన మేనకోడలిపై ఆయనకు ఉన్న ఆప్యాయత ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మెగా, అల్లు కుటుంబాల మధ్య ఉన్న బంధానికి ఇది మరో ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు. క్లిన్ కారాపై బన్నీ చూపించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, ఒక AI ఫోటో చుట్టూ జరిగిన ఈ చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే బన్నీ హార్ట్ ఎమోజీ మాత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

