Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Allu Arjun | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండగా, ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన ఆయన రజినీకాంత్ స్టైల్ పై ప్రశంసలు కురిపిస్తూ ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
Allu Arjun | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండగా, ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన ఆయన రజినీకాంత్ స్టైల్ పై ప్రశంసలు కురిపిస్తూ ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. “చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం” అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ స్టార్ పవర్, ఆయన బాడీ లాంగ్వేజ్, స్వాగ్‌కు ‘జైలర్ 2’ ఒక నిజమైన నిదర్శనమని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ సినిమా ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా అడ్రినలిన్ రష్ ఇచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచిందని ప్రశంసించారు. ఇక ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన మ్యాజిక్‌తో అదరగొట్టాడని, అనిరుధ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన కూల్ శైలిలో మరో బ్లాక్‌బస్టర్‌ను అందించి బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించారని బన్నీ పేర్కొన్నారు. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాతలు తమ ప్రాణంగా పని చేసి ఈ విజయాన్ని సాధించారని అల్లు అర్జున్ అభినందించారు.
#Jailer2 is 🔥🔥🔥
A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping!
Brother… @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman @Nelsondilpkumar garu delivers the coolest hit with a BANG!
చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! 🖤
Congratulations to the entire team! @sunpictures
— Allu Arjun (@alluarjun) October 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

