Allu Arjun – Lokesh | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాలో అల్లు అర్జున్ను ఆయన ఎలా చూపిస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ కనగరాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నా హీరో అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీతో కలిసి చేస్తున్న AA23, LK7 ప్రయాణం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. షూటింగ్ ప్రారంభించి, మన ఇద్దరికీ ఇది ఒక మరువలేని అనుభవంగా మార్చడానికి ఎదురుచూస్తున్నాను” అంటూ ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ను “నా హీరో” అని సంబోధించడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. ఈ కామెంట్స్ ద్వారా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందనే క్లారిటీ కూడా వచ్చింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ చర్చకు దారితీసింది. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే ఈ ప్రాజెక్ట్ కూడా అదే స్థాయిలో భారీగా తెరకెక్కనుంది. యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా, బన్నీ-లోకేష్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. షూటింగ్ ప్రారంభం కాగానే ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వెలువడే అవకాశముంది. అభిమానులు మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.