Raaka | పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA) చుట్టూ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌ను ఒకే పార్టుగా కాకుండా ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన కథా పరిధి ఊహకందనంత పెద్దదిగా ఉండటంతో పాటు, విభిన్న టైమ్‌లైన్స్ మరియు మల్టిపుల్ గెటప్స్‌తో కూడిన ఒక గ్లోబల్ వరల్డ్‌ను ఈ చిత్రంలో డైరెక్టర్ ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తున్న విశాలమైన నేపథ్యానికి పూర్తి న్యాయం చేయాలంటే, ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విభజించడమే సరైన మార్గమని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఒకవేళ ఈ ప్లాన్ కనుక పక్కా అయితే, ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించిన మొదటి పార్టు డిసెంబర్ 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని, రెండో పార్టు 2028లో థియేటర్లలోకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.