ఎన్నడూ చూడని ప్రేమకథను చూస్తారు
‘ట్రైలర్ చూశాను.. చాలా బావుంది. 104రోజుల్లో సినిమా తీశారని చెప్పారు. అంటే నచ్చే దాకా తీశారన్నమాట. ఆ నమ్మకంతోనే కల్ట్ క్లాసిక్ అని పోస్టర్‌పై వేసుకున్నారు. ఈ టీమ్ నాకు తెలుసు. వీరి ప్రతిభ కూడా నాకు తెలుసు. అందుకే చెబుతున్నా.. విజయం తథ్యం’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
‘ట్రైలర్ చూశాను.. చాలా బావుంది. 104రోజుల్లో సినిమా తీశారని చెప్పారు. అంటే నచ్చే దాకా తీశారన్నమాట. ఆ నమ్మకంతోనే కల్ట్ క్లాసిక్ అని పోస్టర్‌పై వేసుకున్నారు. ఈ టీమ్ నాకు తెలుసు. వీరి ప్రతిభ కూడా నాకు తెలుసు. అందుకే చెబుతున్నా.. విజయం తథ్యం’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన యువతరం ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకుడు. ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్ కథను అందించి, ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలందించారు. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘సినిమా మొత్తం కంప్లీట్ అయ్యింది. ైక్లెమాక్స్ ఈ కథకు కీలకం.
అది బాగా రావాలని చాలా కష్టపడ్డాను. తలపై ఇరుముడి మోసే భక్తుడు, ఇరుముడి దించి మొక్కు చెల్లించాక ఎంత తేలిగ్గా ఫీలవుతాడో ఇప్పుడు నేనూ అలాగే ఫీలవుతున్నా. ట్రైలర్ నచ్చితే, సినిమా రెండింతలు నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజులున్నాయి. తెరపై చూసి షాక్ అవుతారు’ అని దర్శకుడు రవి నంబూరి చెప్పారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడే మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. నన్ను నమ్మండి. ఎప్పుడూ చూడని ఓ కొత్త ప్రేమకథను మీరు తెరపై చూస్తారు. బయటకు వచ్చాక కూడా ఆ ట్రాన్స్‌లో ఉండిపోతారు. సినిమా చూస్తూ ప్రతి ప్రేక్షకుడూ ఇంత బావుందేంట్రా అనుకుంటాడు’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా మరో అతిథి మైత్రీ రవిశంకర్, సాయిరాజేశ్, ఎస్కేఎన్, శ్రీగౌరీప్రియ, సహనిర్మాత ధీరజ్ మొగలినేని, త్రిగుణ్, మహేందర్, సిరి హన్మంతు, నరేశ్, పూజా, నవీన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

