Aa Okkati Adakku | సైలెంట్‌గా ఓటీటీలోకి అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు..!
Aa Okkati Adakku | కామిక్ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ అల్లరి నరేశ్ (Allari Naresh) ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 03న విడుదలైంది.
Aa Okkati Adakku | కామిక్ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ అల్లరి నరేశ్ (Allari Naresh) గత కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 03న విడుదలైంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) హీరోయిన్గా నటించింది.
ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ ఒక్కటి అడక్కు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. అయితే ముందుగా ప్రకటన జారీ చేసిన తర్వాత ఓటీటీలో రావాల్సి ఉండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం సైలెంట్‌గా సినిమాను ప్రీమియర్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అల్లరి నరేశ్ ఇటీవలే బచ్చలమల్లి సినిమా అప్డేట్ అందించిన విషయం తెలిసిందే. 1990 కాలంనాటి భావోద్వేగ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు సుబ్బు మంగదేవి దర్శకుడు.
ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్..
ఆ ఒక్కటీ అడక్కు టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

