YRF Spy Universe | యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మక స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘ఆల్ఫా’ అధికారిక ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘ఆల్ఫా’ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో వస్తున్న మొట్టమొదటి మహిళా ప్రధాన స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్లో భారతదేశపు తదుపరి తరం సైనికులను తయారు చేసే రహస్య ప్రోగ్రామ్ ‘ఆల్ఫా’ చుట్టూ కథ తిరుగుతున్నట్లు చూపించారు. “గొర్రెలా కాదు… తోడేలులా జీవించాలి” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్లో ఆలియా భట్ మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కనిపించారు. శర్వరీతో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, గూఢచర్యం, హెవీ కాంబాట్ ట్రైనింగ్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మాణంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.