ముంబై : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికన్ ట్యాలెంట్ ఏజెన్సీ డబ్ల్యూఎంఈతో ఒప్పందం చేసుకున్న అలియా వచ్చే ఏడాది ఆరంభంలో ఓ హాలీవుడ్ మూవీలో నటించనుంది. హాలీవుడ్ స్టూడియోతో ఈ ప్రాజెక్టుపై అలియా ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్.
రెండు హాలీవుడ్ స్క్రిప్టులు విన్న అలియా ఓ స్క్రిప్ట్ పట్ల ఎగ్జైట్‌గా ఉన్నారని ఈ ఒప్పందం ఖరారు కాగానే అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. అలియా నటించిన గంగూభాయ్ కధియావది 2022 జనవరి 6న ధియేటర్లలో సందడి చేయనుంది. 2022లోనే అలియా హాలీవుడ్ ప్రాజెక్టు సైతం పట్టాలెక్కనుంది. అలియా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.