ద్విపాత్రాభినయంలో రామ్ ఔర్ శ్యామ్?
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్కు ‘రామ్ ఔర్ శ్యామ్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్కు ‘రామ్ ఔర్ శ్యామ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘రామ్ ఔర్ శ్యామ్’ అనేది 1967లో లెజెండ్రీ యాక్టర్ దిలీప్‌కుమార్ నటించిన క్లాసిక్. అదే పేరును ఈ సినిమాకు పెట్టడం విశేషం. ఇదిలావుంటే.. ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’కి రీమేక్ అని గతంలో వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని థీమ్ మాత్రమే తీసుకొని హీరో పాత్రను డ్యూయెల్రోల్గా క్రియేట్ చేసి దర్శకుడు అనీస్ బజ్మీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. విద్యాబాలన్ ఇందులో కథానాయిక. వచ్చే ఏడాది మార్చి 17న సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత అనీస్ బజ్మీ డైరెక్షన్లో అక్షయ్‌కుమార్ నటిస్తున్న సినిమా ఇదే. దాంతో ఈ సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

