Bangarraju movie collections | అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపోందింది. జీస్టూడియోస్-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి14న విడుదలైంది. చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ అందుకొని నాగార్జున కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్స్ నమోదుచేసింది. అయితే ఫస్ట్ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న బంగా ర్రాజు.. సెకండ్ వీక్ నుంచి జోరు చూపెట్టలేకపోయింది. ఒక రకంగా కరోనా థర్డ్ వేవ్ కూడా ఈ చిత్రానికి మైనస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వచ్చిన 16 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే..
నైజాం : 8.20 కోట్లు
సీడెడ్ : 6.67 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.08 కోట్లు
ఈస్ట్ : 4.05 కోట్లు
వెస్ట్ : 2.84 కోట్లు
గుంటూరు : 3.38 కోట్లు
కృష్ణా : 2.20 కోట్లు
నెల్లూరు : 1.72 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ : 34.14 కోట్లు (55.40కోట్లగ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక :1.75 కోట్లు
ఓవర్సీస్ : 1.47 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 37.36 కోట్లు(62.75కోట్ల గ్రాస్)
బంగార్రాజు చిత్రానికి 38.15 కోట్ల బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ దగ్గర 39 కోట్ల తో బరిలోకి దిగిన ఈ చిత్రం 16 రోజులు ముగిసేసరికి 37.36 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం క్లీన్ హిట్ సాధించడానికి మరో 1.64 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. ఆంధ్రాలో ఈ చిత్ర కలెక్లన్స్ స్టడీగానే ఉన్నా….నైజాంలో మాత్రం కలెక్షన్స్ తగ్గుతున్నాయి. వచ్చే శుక్రవారం వరకు ఈ సినిమాకు ఛాన్స్ ఉండి. అప్పటివరకు అయినా బంగార్రాజు చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందో లేదో చూడాలి మరి..