సక్సెస్ రేట్ ఎలా వున్నా, అభిమానులకు మాత్రం కొదువలేదు అఖిల్‌కి. ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో తను. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ సినిమా అంటూ పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అధికారిక ప్రకటనైతే లేదు. ప్రస్తుతమైతే తమిళ దర్శకుడు లింగుస్వామి పేరు బలంగా వినిపిస్తుంది. లింగుస్వామి కథను అఖిల్ ఓకే చేశాడని, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలో మొదలుకానుందని ఫిలింవర్గాల భోగట్ట. అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలి. ఏదేమైనా అటు అఖిల్‌కూ ఇటు లింగుస్వామికీ సక్సెస్ అవసరం. మరి అభిమానులు ఈ కాంబినేషన్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.