Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కుటుంబ కథాచిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొందనే ప్రచారం వినిపిస్తోంది.
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కుటుంబ కథాచిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొందనే ప్రచారం వినిపిస్తోంది. వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం సినిమా విడుదలపై పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తొలిరోజు వసూళ్లపై ప్రభావం పడే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా కీలకంగా మారుతుంటాయి. భారీ వర్షాలు, రవాణా సమస్యలు ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ‘ఆదర్శ కుటుంబం’ విడుదల సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వసూళ్లపై ప్రభావం పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తుఫాన్ ప్రభావం కారణంగా సినిమా విడుదలను మరోసారి వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. విడుదల తేదీలో మార్పు ఉంటుందా? లేక ముందుగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తీసుకునే తుది నిర్ణయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు విడుదల తేదీ మార్పుపై వస్తున్న వార్తలను ప్రచారంగానే చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

