టైటిలిచ్చి దీవించిన నాన్నకు థాంక్స్
‘ఉన్నన్ని రోజులూ నాతో సినిమాలు తీసి, హిట్లు ఇచ్చీ, నన్ను సక్సెస్ఫుల్ హీరోని చేశారు నాన్న. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా.. ఆయన టైటిల్ ఇచ్చి నన్ను దీవిస్తున్నారు. ఇది బరువుగా, బాధ్యతగా భావిస్తున్నాను’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక.
‘ఉన్నన్ని రోజులూ నాతో సినిమాలు తీసి, హిట్లు ఇచ్చీ, నన్ను సక్సెస్ఫుల్ హీరోని చేశారు నాన్న. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా.. ఆయన టైటిల్ ఇచ్చి నన్ను దీవిస్తున్నారు. ఇది బరువుగా, బాధ్యతగా భావిస్తున్నాను’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లరి నరేశ్ ఇంకా మాట్లాడుతూ ‘దర్శకుడిగా మల్లికి ఇది తొలి సినిమానే అయినా, అద్భుతంగా తీశాడు. 32మంది కొత్త దర్శకులతో పనిచేశాను. 31మంది విడుదలకు ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి మాత్రం చాలా కూల్‌గా నవ్వుతూ ఉన్నాడు. రాజీవ్ లాంటి నిర్మాతలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, మరో పది సినిమాలు ఆయన నిర్మించి పదిమందికి పని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు. సినిమాకు పనిచేసిన అందరికీ అతిథిగా విచ్చేసిన హీరో అడివి శేషు శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు అతిథులుగా విచ్చేసిన దేవకట్టా, విజయ్ బిన్నీ, బీవీఎస్ రవి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
Telangana | కన్నీళ్లు కాలువలై పారుతున్నా..! తడవని మడి
‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

