Dimple Hayathi | హీరోయిన్లను కాదు, వ్యవస్థను నిందించండి.. ‘పెద్ది’ వివాదంపై నటి డింపుల్ హయాతి కామెంట్స్!
Peddi Contraversy | ఇటీవల విడుదలైన రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై, అలాగే ఆ చిత్ర బృందంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
Dimple Hayathi | ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రపై, అలాగే ఆ చిత్ర బృందంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారంటూ వస్తున్న విమర్శలపై తాజాగా నటి డింపుల్ హయాతి స్పందించారు.
డింపుల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నటీమణుల పాత్రలను రాస్తున్న విధానంపై, వారికి ఇచ్చిన పాత్రలను చేసినందుకు వారిని మాత్రమే తప్పుబట్టే ధోరణిపై చర్చ జరగడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ నటీమణులను కాకుండా, ‘ఇలాంటివే అమ్ముడుపోతాయి’ అని భావించే మేకర్స్(నిర్మాతలు, దర్శకులు)ను మరియు ఈ సినిమా వ్యవస్థను నిందించాలని డింపుల్ అభిప్రాయపడ్డారు. మాలాంటి నటీనటులకు లభించే అవకాశాల పరిధిలోనే పని చేస్తూ, పెద్ద సినిమాల్లో నటిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ఆశపడుతుంటామని వివరించారు. ఒక పాత్ర సరిగ్గా రాయబడకపోతే ఆ బాధ్యత ఆ పాత్రను పోషించిన మహిళది కాదని, అది పూర్తిగా రైటింగ్ మరియు మేకింగ్ ఛాయిస్లదే అవుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ తాము చేసే పాత్రల ఆధారంగా ఒక ఇమేజ్ ముద్ర పడిపోతుందని, దీనివల్ల పూర్తి నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో హీరో ప్రధాన పాత్ర కథల విషయానికి వస్తే వారికి కావాల్సినంత స్వేచ్ఛ, ప్రాధాన్యత లభిస్తాయని, స్క్రీన్‌పై ఏం చూస్తామో దాన్నే ప్రేక్షకులు నమ్ముతారని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఉండే పరిస్థితులు ఒక్కరి నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉండవని, అయితే తామంతా మరింత మెరుగైన అనుభవాలకు, మెరుగైన సినిమా నిర్మాణానికి అర్హులమనే విషయాన్ని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించాలని డింపుల్ హయాతి పిలుపునిచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

