తుఫాన్‌తో కూలిన చెట్టు.. నటి దీపిక ఫోటోషూట్

ముంబై : తౌక్టే తుఫాన్ ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ నష్టమే జరిగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ చెట్లు కూలాయి. టీవీ నటి దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. నేలరాలిన ఆ చెట్టు వద్ద.. యాక్ట్రెస్ దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. ప్రకృతి ప్రకోపాన్ని ఎంజాయ్ చేయాలన్న రీతిలో తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టింది. తన ఇంటి ముందు రాలిన చెట్టుతో ఎవరికీ ఇబ్బంది కాలేదని దియా ఔర్ బాతి హమ్ సీరియల్లో నటిస్తున్న దీపిక సింగ్ చెప్పింది. వెరైటీ వెరటీ ఫోజుల్లో దీపిక ఫోటో షూట్ చేసింది.
కూలిన చెట్టు వద్ద .. దాని కొమ్మలతో రకరకాల ఫోజులిచ్చిందామె. తుఫాన్‌ను ఆపలేమని, ఆ ప్రయత్నం చేయవద్దు అని, మనం ప్రశాంతంగా మారి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన రెండవ పోస్టుకు కూడా మరో ట్యాగ్ ఇచ్చింది. తుఫాన్ పోయే వరకు వేచి ఉండడం కాదు అని, ఆ వర్షంలో డ్యాన్స్‌ను చేయాలని చెప్పింది. దీపిక పెట్టిన పోస్టులపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. కొందరు ఆ ఫోటోలకు లైక్ కొట్టగా, కొందరు మాత్రమే తుఫాన్ వేళ ఏమిటీ ప్రవర్తన అన్న రీతిలో స్పందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

