హీరో శివాజీ, వాసుకి ఆనంద్‌సాయి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న వెబ్‌సిరీస్ ‘90s’ ‘ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. రాజశేఖర్ మేడారం నిర్మాత. ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ని బుధవారం అగ్రహీరో వెంకటేశ్ విడుదలచేశారు. ‘90s జ్ఞాపకాలను గుర్తుచేస్తూ టీవీలో ‘మనోరంజని’ కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ మొదలైంది. శివాజీ ఓ మిడిల్‌క్లాస్ ఫాదర్‌గా, స్కూల్ టీచర్‌గా కనిపిస్తున్నారు. అతని భార్య పాత్రలో వాసుకి కనిపిస్తున్నది. ఓ కుటుంబం చుట్టూ అల్లుకున్న అలనాటి జ్ఞాపకంలా ఈ చిత్రాన్ని మలిచామని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ వెబ్‌సిరీస్‌కి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: అజీమ్ మహ్మద్.