Ram Pothineni | మరో మాస్ డైరెక్టర్‌ను లైన్లో పెట్టిన రామ్ పోతినేని?
Ram Pothineni | విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’లో కూడా సిద్ధార్థ పాత్రతో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.
ఈ చిత్రం తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటితో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇది సెట్స్ పైన ఉండగానే రామ్ మరో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇటీవలే హరీష్ శంకర్ స్టోరీ లైన్ చెప్పాడట, దానికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను చేయనున్నాడు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

