Atlee | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘AA22’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సౌత్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయకుండా మేకర్స్ గట్టి సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు.ఇటీవల అట్లీ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన లయన్ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్లో సింహం ముఖం రెండు వేర్వేరు భాగాలుగా కనిపించడం విశేషం. దీనితో సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారా? లేక ఒక క్లిష్టమైన, మల్టీ-లేయర్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
అట్లీ పోస్టర్‌కు జతచేసిన “నీలా ఎవరూ ఉండలేరు, అదే నీ శక్తి” అనే క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది హీరో పాత్రలో ఉన్న విభిన్న కోణాలను సూచిస్తోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ స్థాయి వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది. అల్లు అర్జున్ ఇప్పటికే పాన్-ఇండియా స్టార్‌గా తన స్థాయిని నిరూపించుకోగా, అట్లీ తన మాస్ కమర్షియల్ టేకింగ్‌తో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ట్రేడ్ వర్గాలు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశముందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అభిమానులు మాత్రం ఆ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అట్లీ షేర్ చేసిన లయన్ పోస్టర్ నిజంగానే అల్లు అర్జున్ పాత్రపై హింట్ ఇస్తుందా? లేక ఇది కేవలం ఆసక్తి రేకెత్తించే ప్రమోషనల్ స్ట్రాటజీనా? అన్నది తెలియాలంటే టీజర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కానీ ‘AA22’పై ఉన్న హైప్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.