అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఓహ్ మేడమ్..’ అనే తొలి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కథానాయకుడి మనసులోని ప్రేమ భావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట అందంగా సాగింది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జోడి అందంగా కనిపించింది. వినోదాత్మకంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని చిత్ర బృందం పేర్కొంది. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్, సహనిర్మాత: భరత్ లక్ష్మీపతి, దర్శకత్వం: మల్లి అంకం.