Aa Okkati Adakku | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా(Faria Abdulla) కథనాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఓ మేడం ఐయామ్ వెయిటింగ్ ఫర్ (Oh Madam) యూ అంటూ సాగే ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను మార్చి 04న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత – అబ్బూరి రవి, ఎడిటర్ – చోటా కె ప్రసాద్, డోప్ – సూర్య, సంగీత దర్శకుడు – గోపీ సుందర్, ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి, సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి, దర్శకుడు- మల్లి అంకం. మార్చి 22 న ఈ సినిమా విడుదల కానుంది.