35 Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘35 చిన్న కథ కాదు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
35 Chinna Katha Kaadu | ప్రియదర్శి (Priyadarshi), నివేదా థామస్ ( Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్ (Viswadev R), ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించగా.. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు.
35 Chinna Katha Kaadu | ప్రియదర్శి (Priyadarshi), నివేదా థామస్ ( Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్ (Viswadev R), ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించగా.. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆహాలో ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతిలో బస్ కండక్టర్‌గా పని చేస్తుంటాడు ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ). ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). వీరికి ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్. అయితే తన భర్త పిల్లలే ప్రపంచంగా బతుకుతుంది సరస్వతి. చిన్నవాడు చదువులో పర్వలేదు కానీ పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్కలు అంటే భయం. అవి అసలే అర్థం కావు. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందని లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి)నే అడుగుతుంటాడు అరుణ్. ప్రాథమిక అంశాలనే ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచీకి పంపిస్తాడు. వరుణ్‌కు లెక్కలు రాకపోవడం వలన అతడిని ఫెయిల్ చేస్తాడు చాణక్య. దీంతో తన తమ్ముడు వరుణ్ క్లాస్‌లోనే కుర్చుంటాడు అరుణ్. అరుణ్ పాస్ అయ్యి స్కూల్ కంటిన్యూ అవ్వాలంటే లెక్కల్లో 35 మార్కులు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు అరుణ్‌ను మందలించగా.. ఇంటి నుంచి పారిపోతాడు. అయితే కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతే.. అతడి తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది. అరుణ్ లెక్కల పరీక్ష పాస్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
A story that touches the soul ❤️
Beautiful Blockbuster #35Movie streaming now only on aha! ✨▶️https://t.co/DsR43KZFtj#35ChinnaKathaKadhu @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/qiObIQMcR6
— ahavideoin (@ahavideoIN) October 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

