2018 Movie | ఓటీటీ ప్రియులకు సర్ ప్రైజ్.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన 2018.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?
2018 Movie on OTT | నెల రోజుల క్రితం కేరళలో విడుదలై ఇప్పటికీ కోట్లు కొల్లగొడుతున్న 2018ను రేపు ఓటీటీలో ఎలా స్ట్రీమింగ్ చేస్తారంటూ ఓ వైపు కేరళ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూంటే.. సోనిలివ్ మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
2018 Movie on OTT | నెల రోజుల క్రితం కేరళలో విడుదలై ఇప్పటికీ కోట్లు కొల్లగొడుతున్న ‘2018’ను రేపు ఓటీటీలో ఎలా స్ట్రీమింగ్ చేస్తారంటూ ఓ వైపు కేరళ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూంటే.. సోనిలివ్ మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అవును ఇది నిజమే.. బుధవారం స్ట్రీమింగ్ కావాల్సిన 2018 సినిమా ఇవాళ సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఐదేళ్ల కిందట కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడిగా జూడ్ ఆంథోని జోసెఫ్ డిస్టింక్షన్ సాధించాడు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని సీటుకు అతుక్కుపోయేలా చేశాడు. నటులు సైతం నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు.
టివినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రెండు వారాల క్రితం బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేశాడు. తొలిరోజే కోటికి పైగా కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇక సెకండ్ రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఇక నిర్మాతలు కూడా బహుశా ఈ రేంజ్ విజయం సాధిస్తుందని ఊహించలేదేమో. అందుకే ముందే ఓటీటీ డీల్ ను ఫిక్స్ చేసుకుని ఇలా నెల రోజులకే డిజిటల్ కు ఇచ్చేశారు.
ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టోవినో థామస్. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించే జర్నలిస్ట్ అపర్ణ బాలమురళి. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న మత్య్సకార కుటుంబానికి చెందిన అసీఫ్అలీ. ప్రభుత్య కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ కలైయారస్ టూరిస్ట్‌లకి గైడ్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అజు వర్ఘీస్. ఇలా ఎవరి జీవితాల్లో వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలా జీవితాన్ని కొనసాగిస్తన్న వీళ్ల లైఫ్‌లోకి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అదే కేరళ వరదలు. ఆ సమయంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈసినిమా తెరకెక్కింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

