2018 Movie | తొలిరోజే కోటి రూపాయలు.. తెలుగు సినిమాలను బీట్ చేసిన డబ్బింగ్ సినిమా
2018 Movie Telugu Collections | కంటెంట్ కాస్త కొత్తగా అనిపిస్తే టాలీవుడ్ ప్రేక్షకులు పర భాష సినిమాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు అని ఇప్పటికే చాలా సినిమాలతో రుజువైంది. కాగా తాజాగా శుక్రవారం విడుదలైన 2018 సినిమాకు కూడా తెలుగులో అదే స్థాయిలో ఆదరణ దక్కుతుంది.
2018 Movie Telugu Collections | కంటెంట్ కాస్త కొత్తగా ఉంటే టాలీవుడ్ ప్రేక్షకులు పర భాష సినిమాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు అని ఇప్పటికే చాలా సినిమాలతో రుజువైంది. కాగా తాజాగా శుక్రవారం విడుదలైన 2018 సినిమాకు కూడా తెలుగులో అదే స్థాయిలో ఆదరణ దక్కుతుంది. మూడు వారాల క్రితం మలయాళంలో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 2018 సినిమా శుక్రవారం తెలుగులో విడుదలైంది. బన్నీ వాసు ఈ సినిమాను తెలుగులో విడుదల చేశాడు. రిలీజ్‌కు ముందు ఒక ప్రెస్ మీట్ తప్పితే పెద్దగా ప్రమోషన్లు గట్రా చేయలేదు. అయినా ఈ సినిమా తొలిరోజే తుఫాన్ లాంటి కలెక్షన్లు సాధించింది.
ఐదేళ్ల కిందట కేరళలో వరదలు భారీగా ముంచెత్తాయి. అక్కడి ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ప్రాణాలు వదిలిసారు. ఇవే పరిమాణాలను ఆధారంగా చేసుకుని జూడ్ ఆంథోని జోసెఫ్ 2018 సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్లు కాస్త మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే కోటి రూపాయల గ్రాస్‌ను సాధించి సంచలనం సృష్టించింది. ఇక సండే వరకు బుకింగ్స్ సాలిడ్ గానే ఉన్నాయి. దాదాపు రెండు కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా తొలి రోజే రూ.60 లక్షల రేంజ్ షేర్‌ను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా లాభాల బాట పడ్డట్లే.
ఇక పోటీగా రిలీజైన మేము ఫేమస్, మళ్లీ పెళ్లి వంటి తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించలేవు. దీన్ని బట్టి చూస్తే కంటెంట్‌తో వస్తే కలెక్షన్లకు అడ్డేది అర్థమవుతుంది. టివినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే మోహన్‌లాల్ పులిమురుగన్ కలెక్షన్లను బీట్ చేసి మలయాళ కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇంకా ఈ సినిమాకు కలెక్షన్ల వరద పారుతూనే ఉంది. ఇక మరో రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా రూ.150 కోట్ల మైలు రాయిని అందుకోనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

