2018 Movie | తొమ్మిది రోజుల్లో 9 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తున్న 2018 మూవీ
2018 Movie Collections | వారం రోజుల క్రితం ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన 2018 మూవీ కోట్లు కొల్లగొడుతుంది. తెలుగు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రెండొందల కోట్ల వైపు అడుగులు వేస్తుంది.
2018 Movie Collections | వారం రోజుల క్రితం ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన 2018 మూవీ కోట్లు కొల్లగొడుతుంది. తెలుగు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రెండొందల కోట్ల వైపు అడుగులు వేస్తుంది. టోవినో థామస్, అపర్ణబాలమురళి, కుంజుకో బాబిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇక తెలుగులో ఈ సినిమాను బన్నీ వాసు విడుదల చేశాడు. భారీగా ప్రమోషన్లు గట్రా చేయకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా తిరుగులేని కలెక్షన్లు రాబడుతూ వస్తుంది.
కాగా ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. బన్నీ వాసు ఈ సినిమా హక్కులను కోటి రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చులకు మరో పది లక్షలు ఖర్చు కావచ్చు. ఈ లెక్కన చూసుకుంటే బన్నీవాసుకు పెట్టిన దానికి మూడు, నాలుగు రెట్లు ఎక్కువే వచ్చింది. అయితే ఈ సినిమా మరో మూడు రోజుల్లో సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు ముందే జరుపుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాతలు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టోవినో థామస్. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించే జర్నలిస్ట్ అపర్ణ బాలమురళి. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న మత్య్సకార కుటుంబానికి చెందిన అసీఫ్అలీ. ప్రభుత్య కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ కలైయారస్ టూరిస్ట్‌లకి గైడ్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అజు వర్ఘీస్. ఇలా ఎవరి జీవితాల్లో వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలా జీవితాన్ని కొనసాగిస్తన్న వీళ్ల లైఫ్‌లోకి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అదే కేరళ వరదలు. ఆ సమయంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈసినిమా తెరకెక్కింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

