Zee merger in Soni ? | సోనీలో విలీనంపై ఏజీఎంకు జీ ఎంటర్టైన్మెంట్ నో
Zee merger in Soni ? | సోనీలో విలీనంపై ఏజీఎం నిర్వహించాలన్న టాప్ ఇన్వెస్టర్ల విజ్ఞప్తిని జీ ఎంటర్టైన్మెంట్ నిరాకరించింది.

Zee merger in Soni ? | సోనీ గ్రూప్‌లో జీ ఎంటర్టైన్మెంట్ విలీనంపై అసాధారణ వార్షిక సమావేశం నిర్వహించాలని టాప్ షేర్ హోల్డర్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తులను జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు శుక్రవారం తిరస్కరించింది. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సోనీ టీవీలో విలీనం చేయాలని నిర్ణయిచామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు తెలిపింది. దేశీయ స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలు, కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ, కంపెనీల చట్టం నిబంధనలకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సోనీ టీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం నిర్ణయంపై అసాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం) నిర్వహించాలని డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీ కోరాయి. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ నేపథ్యంలో ఏజీఎం నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్టీ సూచించింది. దీంతో తమ నిర్ణయంలో మార్పు లేదని జీ ఎంటర్టైన్మెంట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా, సోనీ టీవీ గ్రూప్‌లో విలీన సంస్థకూ జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయెంకా.. మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా నియమితులు కానున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- soni
- Zee Entertainment
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

