అమ్మకానికి ట్రాపికానా బ్రాండ్

- మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయించేస్తున్న పెప్సీ
- డీల్ విలువ రూ.24,500 కోట్లు
న్యూయార్క్, ఆగస్టు 3: ప్రముఖ జ్యూస్ బ్రాండ్ ట్రాపికానాను పెప్సీకో అమ్మేస్తున్నది. మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయించనున్నది. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థతో రూ.24,500 కోట్లకు పెప్సీ డీల్ కుదుర్చుకున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలోనో ఈ లావాదేవీ ముగియవచ్చని అంచనా. కాగా, పీఏఐ పార్ట్‌నర్స్‌తో చేసుకున్న ఈ డీల్‌లో భాగంగా కొత్తగా ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్లో పెప్సీకి 39 శాతం నాన్-కంట్రోలింగ్ వాటా ఉండనున్నది. నిజానికి 20 ఏండ్ల కిందట్నుంచే జ్యూస్‌ల వ్యాపారం క్షీణిస్తూ వస్తున్నది.ఒక్క అమెరికా విషయానికే వస్తే.. 2003లో 4.2 బిలియన్ గ్యాలన్లుగా ఉన్న జ్యూస్ వినియోగం.. 2017లో 3 బిలియన్ గ్యాలన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. ఈ క్రమంలో మున్ముందు మరింతగా పడిపోవచ్చన్న అంచనాల మధ్య పెప్సీకో ఈ నిర్ణయానికి వచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

