హైదరాబాద్, జూన్ 27: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు బంగ్లాదేశ్ నుంచి 130 మిలియన్ డాలర్ల విలువైన(వెయ్యి కోట్లకు పైమాటే) నూతన సోలార్ ప్రాజెక్టు లభించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోఅడుగుపెట్టిన సంస్థగా రికార్డు సృష్టించింది. 100 మెగావాట్ల సోలార్ పీవీ పవర్ ప్లాంట్‌ను డిజైన్, సరఫరా, ఇన్స్టాలేషన్తోపాటు ప్రారంభించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని రూరల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి పొందిన ఈ ఆర్డర్‌ను హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్ సోలార్‌తో కలిసి నిర్వహించనున్నది. వచ్చే ఏడాదిన్నర లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నది.