ముంబై, ఫిబ్రవరి 16: దేశీయ టెక్నాలజీ ఇండస్ట్రీ అంచనాలకుమించి రాణిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి టెక్నాలజీ రంగ సంస్థల ఆదాయం 3.8 శాతం వృద్ధితో 254 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ బాడీ నాస్కాం అంచనావేస్తున్నది. ఇదే సమయంలో 60 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ప్రస్తుతేడాదికిగాను విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 244.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే.