Skoda Sedan Slavia | చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ స్కోడా గురువారం భారత విపణిలో స్లావియా సెడాన్ కారును ఆవిష్కరించింది. ప్రతియేటా 15 లక్షల కార్లు విక్రయించాలన్న స్కోడా తన స్ట్రాటర్జీ 2030 వ్యూహానికి అనుగుణంగా దీర్ఘ కాలిక లక్ష్య సాధనలో స్లావియా సెడాన్ కారు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇక స్లావియా కారు కొనుగోలు చేయాలని ఆసక్తి గల కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్లావియా సెడాన్‌ను వినియోగదారులకు డెలివరీ చేయనున్నారని భావిస్తున్నారు.
మారుతి సుజుకి సియాజ్, హ్యుండాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మిడ్ సైజ్డ్ సెడాన్ కార్లతో స్కోడా స్లావియా పోటీ పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా నాలుగు వెహికల్స్‌లో మిడ్ సైజ్డ్ ఎస్యూవీ కుషక్ కారును మార్చిలో ఆవిష్కరిస్తామని స్కోడా ఆటో సీఈవో థామస్ స్కాఫర్ చెప్పారు.