SBI Home Loan | గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు తగ్గింపు.. లోన్ ఎంతైనా ఒకే రేటు
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ ( SBI Home Loan ) కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ ( SBI Home Loan ) కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోంలోన్‌పై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. అంతేకాదు ఎంత లోన్ తీసుకున్నా.. ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగల సీజన్‌కు ముందు ఇళ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా లబ్ధి చేకూర్చనుందో కూడా బ్యాంకు వివరించింది.
ఇప్పటి వరకూ ఎవరైనా రూ.75 లక్షల హోంలోన్ తీసుకుంటే.. 7.15 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఈ తాజా ఆఫర్‌తో ఏకంగా 45 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనివల్ల రూ.75 లక్షల లోన్, 30 ఏళ్ల వ్యవధిపై రూ.8 లక్షల వరకూ వడ్డీ మిగులుతుంది అని ఎస్బీఐ తెలిపింది. గతంలో ఉద్యోగులకు, ఉద్యోగేతరులకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉండేవి. ఉద్యోగేతరులైతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ తాజా నిర్ణయం వల్ల ఉద్యోగేతరులు కూడా తమ వడ్డీ రేటుపై 15 బేసిస్ పాయింట్లు ఆదా చేసుకోవచ్చు అని బ్యాంక్ చెప్పింది.
ఇన్నాళ్లూ హోంలోన్ వడ్డీ రేట్లపై ఆఫర్లు ఇచ్చినా.. అది సాధారణంగా కొంత మొత్తం లోన్ వరకూ, లోన్ తీసుకునే వారి వృత్తికి అనుగుణంగా ఉండేవి. ఈసారి మాత్రం అందరికీ ఆఫర్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నాం అని ఎస్బీఐ రీటెయిల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు. ఇన్నాళ్లూ కేవలం బడ్జెట్ ఇళ్లను తీసుకునే వారినే ప్రోత్సహించినా.. తాజా నిర్ణయం ఎలాంటి బడ్జెట్ వారికైనా లబ్ధి చేకూర్చనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

