Harley-Davidson Sportster S | ప్రముఖ అమెరికా బైక్ కంపెనీ హార్లీడేవిడ్సన్ తాజాగా భారత విపణిలోకి స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ ఆవిష్కరించింది. అమెరికాలో న్యూ రివల్యూషన్ మ్యాక్స్ 1250 ప్లాట్‌ఫామ్ బేస్‌గా హార్లీ డేవిడ్సన్ ఆవిష్కరించిన రెండో బైక్ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్. అంతే కాదు భారత్‌లో హీరోమోటో కార్ప్స్‌తో కలిసి ఆవిష్కరించిన రెండో బైక్ ఇది. హార్లీ ఓర్జిన్స్ను న్యూ స్పోర్ట్‌స్టర్ ఎస్ పోలి ఉంటుంది. ఇది భారత్‌లోని ఎఫ్టీఆర్ బైక్‌తో గట్టిగా తలపడనున్నది.దీని ధర రూ.15.5 లక్షలు.
1252సీసీ సామర్థ్యం గల వీ-ట్విన్ ఇంజిన్ రూపుదిద్దుకున్నది. ఈ ఇంజిన్ 121 బీహెచ్పీ, 6000 ఆర్పీఎం వద్ద 127 ఎన్ఎం పీక్ టార్చినిస్తుంది. ఈ బైక్ 4 ఆంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, సిగ్నేచర్ డే మేకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్ఆర్ 750 ఫ్లాట్ ట్రాకర్ తరహాలోనే సోలో సీట్స్ రూపొందించారు.