కీలక మైలురాయిని దాటిన హ్యుండాయ్.. అదేమిటంటే..?!
కీలక మైలురాయిని దాటిన హ్యుండాయ్.. అదేమిటంటే..?!| 25 ఏండ్ల క్రితం భారత దేశంలో అడుగు పెట్టిన హ్యుండాయ్ మోటార్స్.. తాజాగా 10వ మిలియన్ కారును ఉత్పత్తి ...

చెన్నై: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఇండియా దేశీయంగా కార్ల ఉత్పత్తిలో బుధవారం కీలక మైలురాయిని దాటింది. తమిళనాడులోని హ్యుండాయ్ ప్రొడక్షన్ యూనిట్లో ఈ మైలురాయిని దాటింది. 25 ఏండ్ల క్రితం చిన్న కారు శాంత్రో తొలి మొడల్గా దేశీయ మార్కెట్లో అడుగు పెడుతుంది.
తాజా లేటెస్ట్ మోడల్ కారు అల్కాజార్ పదవ మిలియన్ల కారును ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ కీలక మైలురాయిని దాటిన సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. కార్ల ఉత్పాదక యూనిట్లో ఓ కారు బాయ్‌నెట్‌పై సంతకం చేశారు.
మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌కు హ్యుండాయ్ కట్టుబడి ఉందని హ్యుండాయ్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో ఎస్ఎస్ కిమ్ చెప్పారు. చారిత్రకంగా 10వ మిలియన్ కారును ఉత్పత్తి చేయడం దానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

భారత్ నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్న సంస్థల్లో హ్యుండాయ్ ఒకటి. 2020 ప్రారంభంలోనే 30 లక్షల కార్లను ఎగుమతి చేసిన మార్క్‌కు చేరుకున్నది. 88 దేశాలకు కార్లను హ్యుండాయ్ ఎగుమతి చేస్తున్నది.
2008 మార్చి నాటికి ఐదు లక్షలకు, 2010 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు, 2014 మార్చి నాటికి 20 లక్షలకు చేరుకున్నది. గతేడాది 1,04,342 యూనిట్లను ఎగుమతి చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

